Mahesh Goud on Vote Theft: ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:29 PM
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓటు చోరీ (Vote Theft)తోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. ఓటు చోరీ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పుకొచ్చారు. ఓటు చోరీతో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓటు చోరీ విషయంలో ప్రతి గ్రామంలో వందకు పైగా సంతకాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఓటు చోరీ జరిగిందని నమ్ముతూ తాను సంతకం పెడుతున్నానని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్.
ప్రతి గ్రామంలో కనీసం వందకి తగ్గకుండా సంతకాలను టీపీసీసీ చేపడుతుందని తెలిపారు. ఓట్ చోరీకి బీజేపీ పాల్పడిందని ఆరోపించారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఓటు చోరీతోనే తెలంగాణలో బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారని తాను పాదయాత్రలో చెప్పానని అన్నారు. ఓటు చోరీపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఇప్పటివరకూ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ ఈటల రాజేందర్ మూడు లక్షల ఓట్ల గెలుపు వెనుక ఓటు చోరీ ఉందని ఆరోపించారు. ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి విఘాతమని చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్.
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు చోరీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటు చోరీని అరికట్టాలని కోరారు. ఓటు చోరీ సంతకాల సేకరణలో జర్నలిస్టులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బిహార్‌లో మూకుమ్మడిగా ఓట్లను తొలగించారని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News