Share News

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:43 PM

ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!
Siddipet Tiger Movement

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలం కూటిగల్, భైరన్‌పల్లి శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మద్దూర్ మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో పులి.. లేగ దూడలపై దాడిచేసి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. పులి పాదముద్రలను పరిశీలించారు.


పులి పాదముద్రల ఆధారంగా యాదాద్రి జిల్లా నుంచి సిద్దిపేటలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. దూల్మిట్ట, మద్దూర్ మండలాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పాద‌ముద్రల ఆధారంగా పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 04:28 PM