తెలంగాణకు 12 లక్షల కోట్ల నిధులిచ్చాం
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:59 AM
తెలంగాణకు తమ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వికసిత భారత్-2047 నిర్మాణమే లక్ష్యంగా .....
ఈయూతో ఒప్పందంతో భారీగా టెక్స్‌టైల్ ఎగుమతులు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు తమ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వికసిత భారత్-2047 నిర్మాణమే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉందన్నారు. కానీ, తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తున్నారని, తమ సర్కారు రూ.12 లక్షల కోట్ల నిధులతోపాటు 5,000 కి.మీ జాతీయ రహదారులను తీసుకొచ్చిందని వివరించారు. తెలంగాణకు తమ ప్రభుత్వం ఏం ఇచ్చిందో విపక్షాలకు తెల్వకపోయినా ప్రజలకు బాగా తెలుసునని శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో చెప్పారు. ‘7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్‌కే మూడు ఇచ్చాం. ఆత్మ నిర్భర భారత్ కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లు ఆధునీకరించాం’ అని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. ఇటీవల ఈయూతో చేసుకున్న ఒప్పందంతో టెక్స్‌టైల్ ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు.