Home » Bhuvanagiri
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద అదుపు తప్పిన లారీ పాదచారులు, రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది.
ఇద్దరిదీ ఒకే వీధి కావడంతో చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు.. తర్వాత స్నేహం ప్రేమగా మారింది.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.
అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8.51 గంటలకు వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు.సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.
సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.