Yadagirigutta Temple: భక్తులకు అలర్ట్.. యాదగిరిగుట్ట ఆలయం మూసివేత
ABN , Publish Date - Sep 06 , 2025 | 10:53 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.
యాదాద్రి, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని (Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple) రేపు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు ఆలయ అధికారులు. ఈ మేరకు ఆలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి 9.56కు ప్రారంభమై రాత్రి 1.26గంటలకు ముగియనుంది సంపూర్ణ చంద్ర గ్రహణం.
రేపు మధ్యాహ్నం 12 గంటల అనంతరం దర్శనాలు, నిత్యా కైంకర్యాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాహన పూజలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఉదయం 3.30కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమంతో పాటు యథావిధిగా నిత్యా కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్
Read Latest Telangana News and National News