Home » Yadadri Temple
ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత పేర్కొన్నారు.
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై శంఖు, చక్ర, నామాలు పునరుద్ధరించేందుకు అధికారులు యోచిస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమలాపూర్ బహిరంగ సభలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియచెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాదాల తయారీకేంద్రంలో చింతపండు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు.
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈరోజు (మే 15న) ప్రపంచ సుందరీ మణులు సందర్శించారు. 9 దేశాలకు చెందిన 30 మంది పోటీ దారులు, సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకుని, దర్శించుకున్నారు.