Share News

రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:16 PM

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన పులులు అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి.. ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం
tiger scare in Telugu states

ఇంటర్‌నెట్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పులుల సంచారం ఎక్కువైపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన పులులు అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది. నిన్న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. వారి వెనకాలే పులి కనిపించింది.


పులి సంచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాజమండ్రి రూరల్, కోరుకుంట్ల, సీతానగరం మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పిల్లల్ని బయటకు వెళ్లినీయకుండా జాగ్రత్త తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. ఇక నెల్లూరు జిల్లా దత్తలూరు మం‌డలం నందిపాడులోనూ పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. రేమానుకుంట వద్ద స్థానికులకు పెద్దపులి కనిపించింది. దీంతో ఉదయగిరి పరిసర ప్రాంతాలవారు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.


యాదాద్రి జిల్లాలోనూ ఇదే సీన్..

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం.. జనాలతో పాటు ఫారెస్ట్ అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 15 రోజులుగా ఫారెస్ట్ అధికారులు పెద్దపులిని పట్టుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఆ పెద్దపులి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ పెద్దపులి యాదాద్రి భువనగిరితో పాటు సిద్ధిపేట జిల్లా సరిహద్దులోనూ సంచరిస్తోంది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతంలోనూ ఓ పెద్దపులి తిరుగుతున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు: హరీష్‌రావు

Updated Date - Feb 02 , 2026 | 01:55 PM