ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: తెలంగాణ కుల సర్వే చూసి ముఖం చాటేసిన మోదీ

ABN, Publish Date - Aug 04 , 2025 | 03:55 AM

రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కుల సర్వేను చూసి ప్రధాని మోదీ ముఖం చాటేశారని, అమిత్‌ షా ఇంట్లో దాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

  • బీసీ రిజర్వేషన్లకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోకాలడ్డు

  • దోచిన సొమ్ము పంచుకునేందుకే కేటీఆర్‌, కవిత పంచాయితీ

  • కాంగ్రె్‌సలో విభేదాలు బీఆర్‌ఎస్‌ మీడియా సృష్టే

  • ముఖ్యమంత్రి రేవంత్‌ది, నాది అన్నదమ్ముల అనుబంధం

  • జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌

నిజామాబాద్‌, నిర్మల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కుల సర్వేను చూసి ప్రధాని మోదీ ముఖం చాటేశారని, అమిత్‌ షా ఇంట్లో దాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో, అంతకముందు నిజామాబాద్‌ జిల్లా అర్గుల్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. శకుని పాత్ర పోషిస్తూ రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించారు. దేవుని పేరు చెప్పి ఓట్లను అడుక్కొని బీజేపీ ప్రజలను మభ్యపెడుతుందని దుయ్యబట్టారు. శ్రీరామునికి బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. పదేళ్ల పాటు దోచుకున్న రాష్ట్ర సంపదను పంచుకునే విషయంలోనే కేటీఆర్‌, కవిత పంచాయితీ తెరపైకి వచ్చిందని మహే్‌షగౌడ్‌ అన్నారు. ఆ గొడవ తీర్చలేకే కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 సీట్లు గెలిచి సోనియాగాంధీకి కానుక ఇస్తామని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు రూ.లక్ష70వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చారని, ఆంగ్లం బాగా మాట్లాడగలిగే కేటీఆర్‌ పదేళ్లలో తెచ్చింది రూ.20 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. ఇక, అర్గుల్‌లో జరిగిన సమావేశంలో మహే్‌షకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, జగదీశ్వర్‌ రెడ్డి బనకచర్ల విషయంలో అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి వెళ్లి రాయలసీమను రతనాలసీమగా మారుస్తానన్నది కేసీఆర్‌ కాదా ? అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలుపుతూ బనకచర్ల వరకు సొరంగం పెట్టి నీళ్లను తోడుకునేందుకు ఇచ్చిన జీవోలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ఫిర్యాదు చేసి ఆపించారని తెలిపారు. ఇక, సీఎం రేవంత్‌కు తనకు విభేదాలు ఉన్నాయనేది బీఆర్‌ఎస్‌ మీడియా చేస్తోన్న దుష్ప్రచారమేనని మహే్‌షకుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. సీఎంతో తనది అన్నదమ్ముల అనుబంధం అని విడదీయరాని బంధం అని అన్నారు. సీఎం, పార్టీ అధిష్ఠానం అనుమతితోనే జనహిత పాదయాత్ర చేస్తున్నట్టు వెల్లడించారు. గత పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత నాయకులదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి సీతక్క, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్‌, బల్మూరి వెంకట్‌, సురేష్‌ షెట్కార్‌, లక్ష్మీకాంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 03:55 AM