KTR: నిందలు.. దందాలు.. చందాలు..
ABN, Publish Date - May 27 , 2025 | 04:40 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీళ్లు.. నిధులు, నియామకాలు నినాదమైతే... ప్రతిపక్షంపై నిందలు.. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంఽధీకి చందాలు పంపడమే సీఎం రేవంత్ రెడ్డి విధానామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఇదే రేవంత్ విధానం: కేటీఆర్
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీళ్లు.. నిధులు, నియామకాలు నినాదమైతే... ప్రతిపక్షంపై నిందలు.. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంఽధీకి చందాలు పంపడమే సీఎం రేవంత్ రెడ్డి విధానామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో నాలుగు కోట్ల మంది ప్రజలను దారుణంగా మోసగించారని, కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని విమర్శించారు. గద్వాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగిన రేవంత్‌రెడ్డి ప్రపంచ సుందరి పోటీలకు వచ్చినవారికి ఆయన కట్టిన కట్టడాలనే చూపిస్తూ తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి వెళ్లిన సన్నాసులకు వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు. గద్వాల ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లినా అక్కడి ప్రజలు మాత్రం బీఆర్‌ఎ్‌సతోనే ఉన్నారని పేర్కొన్నారు. జూన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
పైకప్పు నిర్మించలేనోళ్లు.. విమర్శిస్తున్నారు
భవనం పైకప్పునే సరిగ్గా నిర్మించలేకపోయిన వాళ్లు.. కాళేశ్వరం గురించి విమర్శలు చేయడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బహిర్గతం చేయడానికి సాధారణ వర్షం చాలంటూ సోమవారం ఎక్స్ వేదికగా రెండు విడియోలను ఆయన పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో 430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ అయినా.. ఢిల్లీ విమానాశ్రయం పైకప్పులైనా.. బీజేపీ మార్కు అభివృద్ధిని చెప్పడానికి మే నెలలో కురిసిన సాధారణ వర్షం సరిపోతుందని విమర్శించారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 04:40 AM