KTR: తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో ఎన్నారైలది కీలకపాత్ర
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:47 AM
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసీయుల పాత్ర ఎనలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పదేళ్ల ఉజ్వల ప్రయాణంలో ఎన్నారైల పాత్ర అద్వితీయమని కొనియాడారు.
ఎన్నారై అంటే.. ‘నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా’
పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్
ఓట్లలో వెనకబడ్డామేమో కానీ, తెలంగాణను ప్రేమించడంలో కాదు
డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ, బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబరాల్లో
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసీయుల పాత్ర ఎనలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పదేళ్ల ఉజ్వల ప్రయాణంలో ఎన్నారైల పాత్ర అద్వితీయమని కొనియాడారు. ‘ఎన్నారై అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు.. నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఎన్నారైల పాత్ర ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆడబిడ్డలు ఏనాడూ బతుకమ్మను మర్చిపోలేదని, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదని అభినందించారు. అమెరికాలోని డల్లా్‌సలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు, బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబరాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేటీఆర్.. కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లాలని, అదే సమయంలో జన్మభూమి రుణం కూడా తీర్చుకోవాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ పాలనలో కేవలం పదేళ్లలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్రగా, దేశానికే ఆర్థిక చోదక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని చెప్పారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. అమెరికాలో లీగల్ సెల్ ఏర్పాటు విద్యార్థులను ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బరువులా కాకుండా బాధ్యతగా, ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపామని చెప్పారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఓట్ల పరంగా వెనకపడి ఉండొచ్చు కానీ, తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనకబడమని తెలిపారు. ‘పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా కచ్చితంగా మాకు తెలంగాణ ఫస్ట్, ఇండియానే ఫస్ట్’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ బిడ్డలు బతుకుతెరువు కోసం వలస వెళ్లేవారని.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి తెలంగాణ పొలాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా టీఎ్‌సఐపాస్ విధానాన్ని రూపొందించామని, దాంతో 27 వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని వివరించారు. దేశంలోనే జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాల ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 04:47 AM