KTR: బాధ్యత రేవంత్‌రెడ్డిదే
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:41 AM
రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్.
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాదిలో కలుషిత ఆహారంతో వేలమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, 100 మందికి పైగా మరణించడానికి ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇన్ని విషాద ఘటనలు జరుగుతున్నా విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి కనీసం సమీక్షించకపోవడం నియంతృత్వ, అమానవీయ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ‘‘రేవంత్ కనీసం ఒక తండ్రిగా ఆలోచించాలి. ప్రభుత్వమే విషంపెడితే ఆ చిన్నారులు ఎవరికి చెప్పుకోవాలి? తన పిల్లలకు అలాంటి విషాహారం పెడితే రేవంత్‌రెడ్డి ఊరుకుంటారా?ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆయన పిల్లలుంటే చూసీచూడనట్లు ఉంటారా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. గురుకులాల్లో దారుణాలపై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు.
Updated Date - Jul 16 , 2025 | 03:41 AM