ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సర్కార్‌ను పడగొట్టే కర్మ మాకేంటి?

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:18 AM

ఈ ఐదేళ్లు సీఎంగా రేవంతే ఉండాలని తాము కోరుకుంటున్నామని, అప్పుడే మరో 20ఏళ్ల పాటు కాంగ్రె్‌సకు ప్రజలెవరూ ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆత్మాభిమానం, పౌరుషం, సిగ్గుంటే.. రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేవారన్నారు.

  • ప్రజలే రోడ్లపైకొచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారు

  • కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్ల పాటు ప్రజలు ఓట్లేయరు

  • సిగ్గూశరం లేకనే రేవంత్‌ రాజీనామా చేయలేదు

  • కొందరు పోలీసుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం

  • పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ‘‘దిక్కుమాలిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే కర్మ మాకు లేదు.. ఎవరూ పడగొట్టకుండానే.. రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చాపనులకు జనమే రోడ్లమీదకు వచ్చి బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొడతారు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు సీఎంగా రేవంతే ఉండాలని తాము కోరుకుంటున్నామని, అప్పుడే మరో 20ఏళ్ల పాటు కాంగ్రె్‌సకు ప్రజలెవరూ ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆత్మాభిమానం, పౌరుషం, సిగ్గుంటే.. రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేవారన్నారు. కానీ, ఆయనకు సిగ్గూశరం లేకనే.. ఎన్ని విమర్శలొచ్చినా దులుపుకొని బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్లను ఉద్దేశపూర్వకంగానే టీజీఐఐసీ నరికి వేసిందన్నారు.


పలు డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్‌ యూనివర్సిటీదని కేంద్ర సాధికార కమిటీ తేల్చిందని, భూయాజమాన్య హక్కులు తేలేదాకా తనఖా, లీజుతోపాటు అక్కడ కట్టడాలు నిర్మించడాన్ని తక్షణమే ఆపేలా చొరవ చూపాలని సుప్రీంకోర్టుకు చెప్పిందన్నారు. తెలంగాణ పోలీసుల్లో కొంత మంది రేవంత్‌రెడ్డి ప్రైవేట్‌ సైన్యంలా పని చేస్తున్నారని, వారిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తీరుపై ఏడాదికోసారి విమర్శలు చేయడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అక్రమాలు, అరాచకాలను ఆపాలనుకుంటే కేంద్ర సాధికారిక కమిటీ నివేదిక ఆధారంగా తక్షణమే సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నిర్ణయం కోసం కొద్ది రోజులు ఎదురు చూస్తామని, పట్టించుకోకుంటే.. ఏప్రిల్‌ 27తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్లి ఆధారాలు అందిస్తామని తెలిపారు. అప్పుడూ స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామని హెచ్చరించారు.


రేవంత్‌ పాలనలో రైజింగ్‌ కాదు.. ఫాలింగ్‌:హరీశ్‌

రాష్ట్ర ఆర్థిక వృద్ధి పడిపోతుండటం ఆందోళనకరమని, రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రైజింగ్‌ కాదు... ఫాలింగ్‌ అన్నట్టుగా పరిస్థితి ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. కాగ్‌ విడుదల చేసిన కీ ఇండికేటర్ల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం2023-24లో రూ.1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గిందని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. కొవిడ్‌ సమయంలో తప్ప రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఎప్పుడూ తగ్గుదల లేదని బీఆర్‌ఎస్‌ పాలనలో సొంతపన్నుల ఆదాయ వృద్ధి 12శాతం మేర నమోదైనట్లు తెలిపారు.

Updated Date - Apr 18 , 2025 | 04:19 AM