KTR challenge: రేవంత్.. ఓ పిరికి దద్దమ్మ!
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:18 AM
సీఎం రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఆయన్ను వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
డ్రగ్స్ కేసంటూ నాపై విషం చిమ్మడం ఎందుకు?
ఆయనకు దమ్ముంటే ఆధారాలు చూపించాలి
లేదంటే పర్యవసానాలు తప్పవు: కేటీఆర్
హైదరాబాద్, సిరిసిల్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఆయన్ను వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తనపై డ్రగ్స్ కేసు అంటూ రేవంత్ విషం చిమ్ముతున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చట్ట పరిధి నుంచి, న్యాయస్థానాల నుంచి తప్పించుకోవడానికే చిట్‌చాట్‌ల పేరుతో ముఖ్యమంత్రి దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తనతో ముఖాముఖి చర్చకు వచ్చేందుకు రేవంత్‌కు దమ్ములేదని, ఢిల్లీకి వెళ్లి అక్కడ తనపై ఆయన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంపై ఉన్న గౌరవంతో ఇప్పటిదాకా సంయమనం పాటించానని కేటీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతోందంటూ ఢిల్లీలో రేవంత్ అడ్డగోలుగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు ఆధారం ఏమిటనేది రేవంత్ చెప్పాలన్నారు. లేదంటే తాను చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని ఆయన ఒప్పుకొని.. క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. తనపై రేవంత్ దురుద్దేశపూర్వకంగా నిందలు వేశారని, ఇందుకు ఆయన పర్యవసానాల రూపంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.. సీఎం రేవంత్: యెన్నం
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం రేవంత్‌రెడ్డి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి కొనియాడారు. .కృష్ణా జలాలను కేసీఆర్.. ఏపీకి అప్పగిస్తే, కృష్ణా.. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం సీఎం రేవంత్‌రెడ్డి పోరాడుతున్నారన్నారు. ప్రధాని కావడం కోసం తెలంగాణ ప్రజల హక్కుల్నే తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం.. రేవంత్‌రెడ్డి అన్నారు.
కేటీఆర్ వీక్లీ లీడర్: సామా రామ్మోహన్
కేటీఆర్ ఒక వీక్లీ లీడర్ అని, సీఎం రేవంత్‌రెడ్డిని సవాల్ చేసే స్థాయి ఆయనది కాదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిలది సమాన స్థాయి అని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనవారిలో కేవలం ముగ్గురు అధికారుల ఆస్తుపై సోదాలు జరిగితేనే రూ. వెయ్యి కోట్ల అవినీతి సొమ్ము బయటపడిందన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 04:18 AM