ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: గల్లీ లీడర్‌లా ఖర్గే వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Jul 06 , 2025 | 04:19 AM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఢిల్లీ లీడర్‌లా కాకుండా గల్లీ లీడర్‌లా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌, జులై 5 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఢిల్లీ లీడర్‌లా కాకుండా గల్లీ లీడర్‌లా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీపై ఆయన చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన స్థాయి మరచి ఖర్గే విమర్శలు చేశారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయస్సు గల ఖర్గే ఈ స్థాయికి దిగజారుతారని ఎవరూ ఊహించలేదు. ‘ఈ వ్యాఖ్యలు మీ సొంతమా? లేక ఎవరైనా ఇచ్చిన స్ర్కిప్టు చదివారా?’ అని ఖర్గేను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేసిన పాపం వల్లే పీవోకే పాక్‌ పరమైందని ఆరోపించారు. వరుస వైఫల్యాలతో కాంగ్రె్‌సలో అసహనం నెలకొంద న్నారు. రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్‌, సోషలిస్టు పదాల విషయంలోనూ ఖర్గే ప్రజలను తప్పుదోవ పట్టించారని శనివారం ఒక ప్రకటనలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఐ డ్రీమ్‌ యాంకర్‌పై పోలీసులకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

ఐ డ్రీమ్‌ యూ-ట్యూబ్‌ చానెల్‌ యాంకర్‌ సౌమ్యారెడ్డిపై బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతోపాటు అరుణ్‌ కుమార్‌ అనే న్యాయవాది మీద కూడా ఫిర్యాదు చేశారు. గత నెల 25న అరుణ్‌ కుమార్‌ అనే న్యాయవాదితో జరిగిన ఇంటర్వ్యూలో తప్పుడు ఆరోపణలతోపాటు అబద్ధాలు చెప్పారన్నారు. కనుక యాంకర్‌ సౌమ్యారెడ్డి, న్యాయవాది అరుణ్‌ కుమార్‌, చానెల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 04:19 AM