Share News

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:30 PM

Google Maps Wrong Direction: మహారాష్ట్ర‌కు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
Google Maps Wrong Direction

జనగామ, జులై 5: గూగుల్ మ్యాప్ (Googl Map) తప్పుదారి చూపించడంతో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో కారులోని యువకులకు గాయాలయ్యాయి. జనగామ జిల్లా (Jangaon District) వడ్లకొండ సమీపంలో గత రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారులోని ఐదుగురు యువకులను రక్షించారు. వీరిలో నలుగురు స్వల్పంగా గాయపడటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.


కాగా.. మహారాష్ట్ర‌కు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లింది గూగుల్ మ్యాప్. అయితే బ్రిడ్జ్ అసంపూర్తిగా ఉందని తెలియకపోవడం, పైగా రాత్రి సమయం కావడంతో యువకులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో అక్కడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. అయితే పక్కనే మట్టిదిబ్బ ఉండటంతో స్వల్ప గాయాలతో యువకులు బయటపడ్డారు.


కారు మాత్రం ధ్వంసమైంది. కారు కిందపడటాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని కారులో నుంచి యువకులను బయటకు తీశారు. ఆపై వారిని జనగామ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వారంతా చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. రాత్రి వేళల్లో గూగుల్‌ మ్యాప్ పెట్టుకుని వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు నిర్మాణ పనుల గురించి గూగుల్‌కు అప్‌డేట్ కానటువంటి సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

గంజాయి స్మగ్లింగ్‌లో సరికొత్త పంథా.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 03:35 PM