ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kavitha: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి

ABN, Publish Date - Apr 19 , 2025 | 05:40 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్‌-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

  • అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలి

  • సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్‌-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్రూప్‌-1 పరీక్షల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆమె లేఖ రాశారు. పరీక్ష నిర్వహణ తీరు, ఫలితాల వెల్లడిలో అవకతవకలున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం తగదన్నారు. 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయితే.. ఫలితాలు ప్రకటించే సమయానికి వారి సంఖ్య 21,085 మందికి చేరిందని ఈ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.


కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌కు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.

Updated Date - Apr 19 , 2025 | 05:40 AM