Adi Srinivas: బీజేపీతో పొత్తుకు కేసీఆర్ సిద్ధమని కవిత చెప్పకనే చెప్పారు
ABN, Publish Date - May 23 , 2025 | 03:54 AM
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారంటూ.. ఆయనకు కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
లేఖలో కడిగి పారేశారు: ఆది శ్రీనివాస్
కల్వకుంట్ల కలహాల కుటుంబం: బల్మూరి
బీఆర్‌ఎ్‌సలో మూడు ముక్కలాట: అద్దంకి
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారంటూ.. ఆయనకు కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆ రెండు పార్టీలూ కలిసి పనిచేస్తున్నాయంటూ తాము మొదటి నుంచీ చెబుతున్న మాటలనే ఆమె సమర్థించారని చెప్పారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయన్నారు. బీజేపీపైన పల్లెత్తు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత లేఖలో కడిగి పారేశారని పేర్కొన్నారు. ‘బీఆర్‌ఎస్ బలహీనపడటం వల్ల బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. అలాగే బీఆర్‌ఎ్‌సలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పు పడుతుంటే.. ఇక ప్రజలకు వారేం సమాధానం చెబుతారు’ అని వ్యాఖ్యానించారు.
కల్వకుంట్ల కుటుంబం కాస్తా కలహాల కుటుంబంగా మారిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజలకు ఉన్న అనుమానాలను ఒక లేఖ ద్వారా కవిత ప్రశ్నించిందన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ సంబంధాన్ని ఎత్తి చూపిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా చెల్లెలికి సమాధానం చెప్పి ఆ తర్వాత బయటికొచ్చి కేటీఆర్ నీతులు మాట్లాడాలని సూచించారు. కవిత లేఖను లీక్ చేయాల్సిన దుర్గతి తమ పార్టీకి పట్టలేదని మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలో మూడు ముక్కలాట, అంతర్గత పోరు కొనసాగనుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 03:54 AM