ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Siricilla Political Tension: కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్ వద్ద హైటెన్షన్

ABN, Publish Date - May 26 , 2025 | 12:36 PM

Siricilla Political Tension: సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Siricilla Political Tension

రాజన్న సిరిసిల్ల, మే 26: జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (Former Minister KTR) క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే వారిని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా.. మరోవైపు కేటీఆర్‌ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.


ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ నేతలు ప్రోటోకాల్ విషయంలో ఆందోళనకు దిగారు. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కేటీఆర్‌ క్యాంప్ కార్యాలయంలో ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నిస్తూ.. సీఎం ఫోటోతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గేటు వద్దే బీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది.


తోపులాట చోటు చేసుకోగా... ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాదాపు 15 నిమిషాల పాటు రెండు పార్టీల నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వెంటనే కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే కేటీఆర్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో సిరిసిల్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ క్యాంపు ఆఫీసు వద్ద మరల ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 12:39 PM