ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నారం బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలి

ABN, Publish Date - May 25 , 2025 | 04:38 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతులకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌-విజేత-పీఈఎ్‌స జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది.

  • ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ లేఖ

  • మేడిగడ్డ పునరుద్ధరణకు డిజైనర్‌ను నియమించాలని ఎల్‌ అండ్‌ టీ లేఖ

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతులకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌-విజేత-పీఈఎ్‌స జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. బ్యారేజీ పునరుద్ధరణకు అవసరమైన సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. నిధుల కొరత తీవ్రం గా ఉందని, ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లు రూ.176.46 కోట్లు(ఓ అండ్‌ ఎం పనులకు సంబంధిం చి రూ.6.42 కోట్లు, ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫారసులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.45 కోట్లు కలిపి) విడుదల చేయాలని లేఖ రాసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర సిఫారసుల్లో భూ సాంకేతిక పరీక్షలు తప్ప ఇతర అన్ని పనులు చేశామని గుర్తుచేసింది. వరద ఉధృతిని తగ్గించే వ్యవస్థలు లేనందువల్లే బ్యారేజీ దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు చెల్లాచెదురు అయ్యాయని తెలిపింది.


డిజైన్‌ లోపాల వల్లే బ్యారేజీ దిగువ భాగంలో సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు దెబ్బతిన్నాయని నివేదించింది. డ్యామ్‌ భద్రత సమీక్ష కమిటీ సభ్యులతో పాటు నీటిపారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) అధికారుల బృందం అన్నారం బ్యారేజీలో స్టిల్లింగ్‌ బేసిన్‌తో పాటు కటా్‌ఫను పెంచాలని సూచించారని గుర్తుచే సింది. ఎన్‌డీఎ్‌సఏ పూర్తి నివేదిక అమలు కోసం నిపుణులైన సంస్థ లేదా డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని, ఎన్‌డీఎ్‌సఏ సూచనల ప్రకారం బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్‌ తయారుచేయాలని జాయింట్‌ వెంచర్‌ పేర్కొంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక అమలు చేయడానికి ‘రిహాబిలిటేషన్‌ డిజైనర్‌’ను నియమించాలని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మేడిగడ్డలోని బ్లాక్‌-1-8ల దాకా భూభౌతిక పరీక్షలు కేంద్ర సంస్థలతో చేయించామని తెలిపింది. 2023 నవంబరు నుంచి 2024 దాకా కాఫర్‌ డ్యామ్‌తో పాటు రోడ్డును నిర్మించి, 2024 జూన్‌లో తొలగించామని, బ్లాక్‌-7 రక్షణ కోసం పనులు చేశామని పేర్కొంది. వానాకాలానికి ముందే ‘రిహాబిలిటేషన్‌ డిజైనర్‌’ను నియమించాలని కోరింది. మధ్యంతర నివేదికలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.16.54 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:38 AM