ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:36 AM

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది.

JEE Results 2025
  • 24 మందికి 100 పర్సంటైల్‌

  • తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి ఒకరు

  • తెలుగు విద్యార్థులకు 8, 16, 22, 24వ ర్యాంకులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుది కీ విడుదల చేసిన అధికారులు.. విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా.. 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు.


రాజస్థాన్‌కు చెందిన మహ్మద్‌ అనాస్‌ ఫస్ట్‌ ర్యాంకు, ఆయుష్‌ సింఘాల్‌ రెండో ర్యాంకు సాధించారు. 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఎ.గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీ, ఏపీ నుంచి సాయిమనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు. కాగా, హర్ష ఎ.గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించగా, అజయ్‌రెడ్డి ఆలిండియా 16వ ర్యాంకుతో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో టాప్‌లో నిలిచాడు. సాయిమనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకు, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బనిబ్రత మజీకి ఆలిండియా 24వ ర్యాంకు లభించింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 10:39 AM