ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagga Reddy: గుల్జార్‌హౌజ్‌ ప్రమాదంపై నిమిషాల్లోనే సీఎం రేవంత్‌ స్పందించారు

ABN, Publish Date - May 20 , 2025 | 05:09 AM

గుల్జార్‌ హౌజ్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్‌ అయి.. జీహెచ్‌ఎంసీ అధికారులను అలర్ట్‌ చేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు.

చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. స్వయంగా వెళ్తే సహాయ చర్యలకు ఇబ్బందనే వెళ్లలేదు

  • సీఎం ఆదేశాల మేరకు భట్టి, పొన్నం, దామోదర వెళ్లారు

  • క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను నేరుగా పర్యవేక్షించారు

  • కేటీఆర్‌ చెప్పినట్లు కిషన్‌రెడ్డి మాట్లాడడం.. చిత్రంగా ఉంది

  • అనుకోని ప్రమాదంపై రాజకీయం ఎందుకు చేస్తున్నట్టు?

  • గతంలో ‘భరతమాతకు హారతి’లో ముగ్గురు చనిపోలేదా?

  • గుజరాత్‌లో బ్రిడ్జి కూలి 140 మంది మరణించలేదా?

  • ఆ ఘటనలను రాహుల్‌, రేవంత్‌ రాజకీయం చేశారా?

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌ హౌజ్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్‌ అయి.. జీహెచ్‌ఎంసీ అధికారులను అలర్ట్‌ చేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారన్నారు. తాను ఘటనా స్థలానికి వెళితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మంత్రులను అక్కడికి పంపారని చెప్ప్పారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్‌లో ఆదేశాలిస్తూ.. ప్రమాదరం బారినపడిన 17 మందిని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. జరగాల్సిన ప్రాణ నష్టం జరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాల్లో తన సన్నిహితుడి కుటుంబం కూడా ఉందని తెలిపారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ తదితరులు అన్నీ దగ్గరుండి చూసుకున్నారన్నారు. బాధ్యతగల కేంద్రమంత్రిగా ఘటనా స్థలానికి కిషన్‌రెడ్డి వచ్చాడనుకున్నామని, కానీ ఆయన ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చారని తర్వాత అర్థమైందన్నారు. ఆయన మాట్లాడిన తీరు.. బాధ్యత లేని నేత మాట్లాడినట్లుగా ఉందన్నారు.


కేటీఆర్‌ ఏం చెబితే కిషన్‌రెడ్డి అది మాట్లాడుతున్నాడని ఓ మిత్రుడు చెబితే తనకు చిత్రంగా అనిపించిందన్నారు. కిషన్‌రెడ్డి.. మోదీ చెబితే వస్తాడే కానీ.. కేటీఆర్‌ చెబితే వస్తాడా అన్న అనుమానమూ కలిగిందన్నారు. ‘‘వాస్తవానికి కిషన్‌రెడ్డి అలాంటి మనిషి కాదు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. గుజరాత్‌లో వంతెన కూలి 140 మంది చనిపోతే.. కిషన్‌రెడ్డిలా రాహల్‌గాంధీ ఏమైనా రాజకీయం చేశారా? ఇదే కిషన్‌రెడ్డి భారత్‌మాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తే బాణాసంచా పేలి ఇద్దరు.. హుస్సేన్‌సాగర్‌లో పడి ఒకరు మరణించారు. దానిపై సీఎం రేవంత్‌ ఏమైనా మాట్లాడారా? ప్రధాని మోదీ ప్రారంభించిన చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఈదురుగాలికి రేకులు పడిపోయాయి. దానిని మేమేమైనా విమర్శించామా? ఆయా ఘటనల సమయంలో రేవంత్‌రెడ్డి బాధ్యత గల నేతలా వ్యవహరిస్తే.. గుల్జార్‌హౌస్‌ ఘటనలో కిషన్‌రెడ్డి బాధ్యత లేకుండా బురద జల్లే పని పెట్టుకున్నడు’’ అని దుయ్యబట్టారు. ఎంతసేపూ రాజకీయం చేయాలనే కిషన్‌రెడ్డి ఆలోచన తప్పని అన్నారు. తన కంటే సీనియర్‌గా కిషన్‌రెడ్డిని గౌరవిస్తానని, ఆయన విమర్శలు చేయడం మానుకుని.. సేవ చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 05:09 AM