ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyper Sonic Success: హైపర్‌సోనిక్‌ స్ర్కామ్‌జెట్‌ కంబస్టర్‌ పరీక్ష విజయవంతం

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:55 AM

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో హైపర్‌సోనిక్‌ స్ర్కామ్‌జెట్‌ కంబస్టర్‌ పరీక్ష విజయవంతం. ఈ విజయంతో హైపర్‌ సోనిక్‌ క్షిపణుల సాంకేతికతలో India ముందడుగు వేసింది

  • హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో ప్రయోగం

  • అత్యాధునిక ఆయుధ సాంకేతికతలో కీలక మైలురాయి

  • శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్‌నాథ్‌

అల్వాల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అత్యంత వేగంగా దూసుకుపోయే హైపర్‌ సోనిక్‌ క్షిపణుల సాంకేతికతలో రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో అంటే గంటకు 6,100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే క్షిపణుల్లో వినియోగించే.. అత్యాధునిక స్ర్కామ్‌జెట్‌ ఇంజన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరీక్షను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌)లో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘స్ర్కామ్‌జెట్‌ కనెక్ట్‌ టెస్ట్‌ ఫెసిలిటీ’లో ఈ పరీక్ష నిర్వహించారు. ఇది స్ర్కామ్‌జెట్‌ ఇంజన్‌ సబ్‌స్కేల్‌ పరీక్ష (అసలైన పెద్ద ఇంజన్‌కు సంబంధించిన అచ్చమైన చిన్న ప్రతిరూపాన్ని తయారు చేసి పరీక్షించడం). అత్యధిక శక్తిని విడుదల చేస్తూ, హైపర్‌ సోనిక్‌ వేగంతో ప్రయాణించినప్పుడు తీవ్రమైన ఉష్ణం వెలువడుతుంది. దాన్ని నియంత్రించకుంటే ఇంజన్‌ ఫెయిలవుతుంది.


ఆ వేడిని నియంత్రించేందుకు యాక్టివ్‌ కూల్డ్‌ సాంకేతికతను వినియోగిస్తారు. శుక్రవారం హైపర్‌ సోనిక్‌ స్ర్కామ్‌జెట్‌ ఇంజన్‌కు సంబంధించి.. యాక్టివ్‌ కూల్డ్‌ సబ్‌స్కేల్‌ కంబస్టర్‌ (ఇంధనాన్ని మండించే) పరీక్ష నిర్వహించారు. ఇందులో ఇంజన్‌ 1,000 సెకన్లకుపైగా విజయవంతంగా పనిచేసింది. అంటే నేరుగా పూరిస్థాయి స్ర్కామ్‌జెట్‌ను పరీక్షించేందుకు మార్గం సుగమం అయినట్టే. ఈ విజయం సాధించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 04:55 AM