Uttam Kumar Reddy: బనకచర్లపై తమ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:31 PM
ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న వైఖరిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై తమ వాదనతో కేంద్రం ఏకీభవించిందని తెలిపారు.
హైదరాబాద్, జులై 01: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ప్రజా భవన్‌లో బనకచర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నదిలో ఏపీకి ఎక్కువ నీళ్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.
గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు మొదలయ్యాయిని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంపై దుష్ప్రాచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. తమ వాదనతో కేంద్రం ఏకీభవించిందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి:
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More Telangana News and Telugu News
Updated Date - Jul 01 , 2025 | 06:58 PM