CM Revanth Reddy: పాశమైలారం బాధితుల పరామర్శ.. సీఎం రియాక్షన్..
ABN, Publish Date - Jul 01 , 2025 | 09:57 PM
పాశమైలారం పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
సంగారెడ్డి, జులై 01: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 46 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
పాశమైలారం పారిశ్రామిక వాడ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి, వారి ఆవేదనను పంచుకున్నానన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వారి బాధను అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం వైపు నుండి.. వారికి తక్షణం అందాల్సిన, దీర్ఘ కాలికంలో చేయాల్సిన సహాయంపై అక్కడికక్కడే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చానని వివరించారు.
బాధితులను గుర్తించడం, తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, ఇతర అవసరాలతోపాటు.. పసి బిడ్డలు ఉన్న వాళ్ల విషయంలో వారికి కావాల్సిన అవసరాలు.. ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చానన్నారు. బాధిత కుటుంబాలు.. ఈ గాయం నుండి కోలుకుని తిరిగి జీవనం సాగించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
For More Telangana News and Telugu News
Updated Date - Jul 01 , 2025 | 10:12 PM