AndhraPradesh: ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ ఆంధ్రప్రదేశ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 09:17 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య వారిని తమిళనాడుకు తరలించారు.
ప్రొద్దుటూరు, జులై 01: ఉగ్రవాదుల కలకలంతో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పట్టణానికి చెందిన అబూబక్కర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్, షేక్ మన్సూర్‌ను మంగళవారం నాడు తమిళనాడుకు చెందిన యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. అనంతరం వారిని భారీ భద్రత మధ్య తమిళనాడుకు తరలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరిద్దరిపై ఇప్పటికే పలు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.
వీరిద్దరి అరెస్ట్ నేపథ్యంలో రాయచోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ ఇరువురి ఉగ్రవాదులు 200మందికి పైగా ఉగ్రమూకలను తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు బృందాలు చాలా లోతుగా విచారణ చేస్తున్నాయి. అయితే రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ స్కూల్ ఎదుట అబూబక్కర్ సిద్ధిక్.. చిల్లర దుకాణం నడుపుతున్నారు. అలాగే షేక్ మన్సూర్ సైతం రాయచోటిలో మహబూబ్ బాషా వీధిలో చీరలతోపాటు చిల్లర కొట్టుతో జీవనం సాగిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల అరెస్టు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి:
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More AP News and Telugu News