Nellore Tour: వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:12 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులో చీమకు అపకారం జరిగినా ఊరుకోమని స్పష్టం చేశారు.

నెల్లూరు, జులై 01: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శకి రప్పా రప్పా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జులై 3న పర్యటన సందర్భంగా నెల్లూరులో చీమకు హాని చేసినా వదిలిపెట్టమని సోమరెడ్డి హెచ్చరించారు.
అయితే వైఎస్ జగన్ పర్యటన కోసం 50 వేల మందిని సమీకరించాలంటూ ఆ పార్టీ నేత తలశిల రఘురామ్‌ను గత వారం రోజులుగా నెల్లూరులో మకాం వేశారన్నారు సోమిరెడ్డి. రెంటపాళ్లలో తనను నమ్మి బెట్టింగ్‌లకు పాల్పడిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వైఎస్ జగన్ వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలో 89 కిలోమీటర్ల మేర ర్యాలీ చేసి బీభత్సం సృష్టించారని మండిపడ్డారు. పర్యటనకు 600మందికిపైగా పోలీసులను పెడితే రోప్ పార్టీ లేదన్నారంటూ వైఎస్ జగన్‌పై సోమిరెడ్డి నిప్పులు చెరిగారు.
నెల్లూరులో జగన్‌తోపాటు ఆయన వెంట కొంత మందికే అనుమతి కోరారని.. కానీ 50 వేల మందిని సమీకరిస్తున్నారని అన్నారు. 'ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టండి.. రౌడీలను తీసుకురండి.. గంజాయి బ్యాచ్‌లను రప్పించడంటూ' వైసీపీ అధినేత పిలుపు ఇస్తున్నారని ఆరోపించారు. 'వైఎస్ జగన్.. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నావు.. ఇది కడపలో కూడా కుదరదని' సోమిరెడ్డి స్పష్టం చేశారు. నీలాంటి వారిని ముఖ్యమంత్రిగా చూడటమే ప్రజల దౌర్భాగ్యమన్నారు.
నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు చిన్న చీమకి ఇబ్బంది జరిగినా సహించేది లేదంటూ వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలోనే ఏపీ మద్యం కుంభకోణం వంటిది ఎవరూ చూడలేదన్నారు. విదేశాలకి మ్యాపింగ్ చేయడం చూసి దేశ ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కూరుకుపోయావంటూ వైఎస్ జగన్‌పై మండిపడ్డారు.
ఒక్క పరిశ్రమ కానీ, క్వాంటమ్ వంటివి కానీ.. ఏపీకి తేవాలనే ఆలోచన మీకు ఏనాడైనా వచ్చిందా? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. మీ ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదన్నారు. 'జాగ్రత్తగా మసులుకోండి. మేము శాంతి కాముకులం.. తేడా వస్తే మేమూ లక్షల మందిని సమీకరించ గలమంటూ' వైఎస్ జగన్‌ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More AP News and Telugu News