ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Congress MLAs: ఢిల్లీకి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కారణమిదే

ABN, Publish Date - May 29 , 2025 | 03:43 PM

Congress MLAs: తెలంగాణ కేబినెట్ విస్తరణ వివాదం ఢిల్లీకి చేరింది. నలుగురు కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.

Madiga Congress MLAs

న్యూఢిల్లీ, మే 29: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణ వివాదం ఢిల్లీకి తాకింది. ఢిల్లీలో నలుగురు తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు (Madiga Congress MLAs) మకాం వేశారు. అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వం పల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు (గురువారం) సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వీరు కలువనున్నారు. మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోరనున్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, పీసీసీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌కు తెలిపే ఢిల్లీ వచ్చామన్నారు. తమ న్యాయమైన డిమాండ్ అన్నారు. మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్‌లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద సామాజిక వర్గమన్నారు. తమ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలన్నారు. మాదిగ వర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉందని తెలిపారు. మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల తమకు అభ్యంతరం లేదని చెప్పారు.


మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి ఢిల్లీ వచ్చామన్నారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి కచ్చితంగా స్థానం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మొదటి కేబినెట్ ఏర్పాటులోనే తమకు అవకాశం దక్కుతుందని భావించామని.. ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని నలుగురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

బీఆర్‌ఎస్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 29 , 2025 | 04:35 PM