Share News

Raja Singh Comments: బీఆర్‌ఎస్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 29 , 2025 | 01:46 PM

Raja Singh Comments: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై మద్దతు తెలుపుతూ సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే.

Raja Singh Comments: బీఆర్‌ఎస్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh Comments

హైదరాబాద్, మే 29: బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వ్యాఖ్యలు నిజమే అని అనుకుంటున్నాని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు (బీజేపీ) కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్‌ఎస్‌లో కలిపేసేవారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్‌ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని అందుకే బీజేపీ నష్టపోయిందని అన్నారు. ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని.. కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు.


ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీని వల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలుసని.. అయినా ఎవరూ బయటపడరన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు, అధికారులు నోరు మూసుకుని కూర్చున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ లేఖను విడుదల చేశారు.


అయితే సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీపై పలు విమర్శలు చేశారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అధికారపార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంత పాడటం అనేది బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలావాటు అయ్యిందని, పాత స్క్రాబ్‌ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ గతంలో కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు తాజాగా ఈరోజు(గురువారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడిన రాజాసింగ్.. కవిత వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. కవిత వ్యాఖ్యలు నిజమే అని భావిస్తూ ఎమ్మెల్యే ఓ లేఖను విడుదల చేశారు. అయితే కవితకు సంబంధించి విషయాలపై ఎవరూ మాట్లాడటానికి వీలులేదని, ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని.. జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్తుదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు పార్టీ లైన్ క్రాస్ చేస్తూ రాజాసింగ్ చేసి వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 29 , 2025 | 02:01 PM