ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IAS Tranfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

ABN, Publish Date - Jun 12 , 2025 | 09:18 PM

ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్‌ కుమార్‌‌ను నియమించింది. ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) చీఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్‌ను బదిలీ చేసింది. ఇక ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను నియమించింది.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్‌ కుమార్‌‌ను నియమించింది. ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) చీఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమించింది. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఎండీ జె.శంకరయ్యను నియమించింది.

తెలంగాణ భవన్ ముఖ్య కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్‌‌ను బదిలీ చేసింది. సమాచార కమిషన్ సెక్రటరీగా భారతీ లక‌పతినాయక్‌ను నియమించింది. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబరీష్, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌‌గా టి.వినయ్‌ కృష్ణారెడ్డిని బదిలీ చేసింది. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రటరీగా రాజీవ్‌గాంధీ హనుమంతును నియమించింది.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఈ నవీన్ నికోలస్‌ను బదిలీ చేసింది. ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా కె. శివకుమార్ నాయుడును నియమించింది. ఇక సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మీని బదిలీ చేసింది. జి. సృజనకి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్‌. శివశంకర్‌‌ను నియమించింది. ఆయనకు విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

అలాగే సింగరేణి డైరెక్టర్‌గా పి. గౌతమ్‌ను నియమించింది. ఆయనకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించింది. సిద్ధిపేట కలెక్టర్‌గా కె.హైమావతి, మత్స్యశాఖ డైరెక్టర్‌గా కె. నిఖిలను నియమించారు. పర్యాటక శాఖ ఎండీగా వల్లూరి క్రాంతి నియమించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవోగా పి. ఉదయ్ కుమార్, టీజీపీఎస్‌సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పి. ప్రావీణ్యను బదిలీ చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని ఎం చౌదరిని నియమించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా అనుదీప్ దూరిశెట్టిని బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ముజామిల్ ఖాన్‌ను నియమించారు.

ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ప్రియాంక, జీడబ్ల్యూ‌ఎంసీ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్‌లను బదిలీ చేశారు. కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా అశ్విని తానాజీ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ప్రఫుల్‌ దేశాయ్‌‌ను నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగా షఫియుల్లా, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌గా ప్రసాద్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి, ఆయుష్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ బాబు, టీజీఐఐసీ ఈడీగా పవన్ కుమార్, సీఎం సీపీఆర్వోగా జి మల్సూర్‌లను బదిలీ చేసింది.

కొత్త మంత్రులకు జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. తన కేబినెట్‌లోకి ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలను తీసుకుని.. వారికి తన వద్దనున్న శాఖలను కేటాయించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులను మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • మెదక్‌ జిల్లా: గడ్డం వివేక్‌

  • నల్గొండ జిల్లా: అడ్లూరి లక్ష్మణ్‌

  • ఖమ్మం జిల్లా: వాకిటి శ్రీహరి

  • కరీంనగర్‌ జిల్లా: తుమ్మల నాగేశ్వరరావు

  • ఆదిలాబాద్‌ జిల్లా: జూపల్లి కృష్ణారావు

  • నిజామాబాద్‌ జిల్లా: సీతక్క

  • మహబూబ్‌నగర్‌ జిల్లా: దామోదర రాజనరసింహ

  • రంగారెడ్డి జిల్లా: డి. శ్రీధర్‌బాబు

  • హైదరాబాద్‌ జిల్లా: పొన్నం ప్రభాకర్‌

  • వరంగల్‌ జిల్లా: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈ వార్తలు కూడా చదవండి..

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For Telangana News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 09:52 PM