Share News

Ahmedabad Plane Crash:లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:35 PM

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో లోపం ఉందని ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా సంస్థకు ముందే సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

Ahmedabad Plane Crash:లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

న్యూఢిల్లీ, జూన్ 12: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు.


అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం.. న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదగా లండన్ వెళ్లనుంది. అకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్‌లో దిగిపోయారు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ .. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరోవైపు ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌ 6, డిసెంబర్‌లో.. రెండుసార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరగా మూడో సారి అంటే ఈ రోజు అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్‌లో కుప్ప కూలిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంతకీ మేడే కాల్ అంటే..?

విమాన ప్రమాదంలో 242 మంది మృతి

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 06:22 PM