Air India Plane Crash: ఇంతకీ మేడే కాల్ అంటే..?
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:09 PM
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం కూలిన ఘటనలో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది అంతా మరణించారు.
న్యూఢిల్లీ, జూన్ 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం కూలిన ఘటనలో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది అంతా మరణించారు. అయితే ఈ విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఎయిర్ ఇండియా విమానం మేడే కాల్ జారీ చేసిందంటూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంతకీ మేడే కాల్ అంటే..?
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. తాము అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేయడం కోసం ఈ పదాన్ని వాడుతారు. అంటే.. తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేయడం. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు మూడు సార్లు అంటారని చెబుతారు. అసలు ఈ మేడే పదం మైడెర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందని అంటున్నారు. అంటే సాయం చేయండి అని దీని అర్థమట. విమానాల్లో, నౌకల్లో ఈ మేడే కాల్‌ను వాడతారు.