ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: కుంభమేళాకు వెళ్లివస్తుండగా ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ABN, Publish Date - Feb 11 , 2025 | 12:52 PM

Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో .ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. వీరంతా హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Madya Pradesh Bus Accident

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర మినీ బస్సును భారీ సిమెంట్ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్రనగర్ వాసులుగా తెలుస్తోంది. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. మొత్తం మూడు బస్సుల్లో కుంభమేళాకు యాత్రికులు వెళ్లారు. ప్రమాదానికి గురైన బస్సు నెం. AP29 W 1525గా గుర్తించారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఘటన స్థలానికి జబల్‌పూర్‌ ఎస్పీ, కలెక్టర్ చేరుకున్నారు.


తెలుగు యాత్రికుల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో సెక్రటరీల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏడుగురు యాత్రికులు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు

మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 01:04 PM