Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..
ABN, Publish Date - May 21 , 2025 | 07:38 AM
రంగారెడ్డి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను కారు అతివేగంగా ఢీకొట్టింది.
రంగారెడ్డి: హయత్ నగర్ మండలం కుంట్లూరులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గడ్డ పార సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతులు చంద్రసేనా రెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. వీరంతా కుంట్లూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో కుంట్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tummala Nageswara Rao : మరిన్ని గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం
Kondagattu Temple Rituals: ఘనంగా కొండగట్టు అంజన్న పెద్ద జయంత్యుత్సవాలు
For Telangana News And Telugu News
Updated Date - May 21 , 2025 | 09:08 AM