ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Raja Singh: పార్టీ అగ్ర నాయకత్వంపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్

ABN, Publish Date - Jun 02 , 2025 | 09:57 PM

బీజేపీ అగ్రనాయకత్వంపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే సస్పెండ్ చేయండంటూ పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరారు.

BJP MLA Raja Singh

హైదరాబాద్, జూన్ 02: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు కాదు.. దమ్ముంటే సస్పెండ్ చేయండంటూ పార్టీ అధిష్టానానికి ఆయన సవాల్ విసిరారు. సోమవారం పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ హద్దులను అతిక్రమించడంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకునేందుకు అటు జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వినిపిస్తున్నారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనేందుకు జాతీయ నాయకత్వం సిద్ధమైంది. అందులోభాగంగా రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేసింది.


దాంతో రాష్ట్రనాయకత్వం క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ సోమవారం కాస్తా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనకు నోటీసులు ఇవ్వడమేంటి.. దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంటూ పార్టీ అధిష్టానానికి సూటిగా ఆయన సవాల్ విసిరారు. ఇంతకంటే కూడా... తో కలిసి పని చేయడం తన వల్ల కావడం లేదంటూ ఆయన తీవ్ర అభ్యంతరకరమైన భాషతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేశారనే చర్చ ఆ పార్టీలో వాడి వేడిగా నడుస్తోంది.


అయినా రాజాసింగ్ లైన్ ఏమిటీ.. అతడు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాడనే విషయంపై పార్టీలో అంతర్గతంగా ఓ చర్చ అయితే సాగుతోంది. రాజాసింగ్ ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నా.. జాతీయ నాయకత్వం ఎందుకు లైట్‌గా తీసుకుంటుందనే వాదన సైతం వినిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం ఎందుకు సీరియస్‌గా తీసుకుంటుందనే అంశంపై చర్చ సాగుతోంది. అదీకాక రాష్ట్ర నాయకత్వంపైన.. రాష్ట్రంలోని పలువురు సీనియర్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి రాష్ట్ర నాయకత్వం తీసుకు వెళ్లింది. దాంతో కేంద్ర నాయకత్వం రాజాసింగ్‌పై దృష్టి సారించింది. అందులోభాగంగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి..

అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకోవద్దు

తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ లో మిస్ వరల్డ్ విజేత సుచాత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2025 | 10:11 PM