ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:03 PM

Crime News: వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

Daughter kills father

Nizamabad: రక్త సంబంధాలు రోజు రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఆస్తులు, ఇంట్లో గొడవలు ఇలా రకరకాల కారణాలతో (Family Dispute) ఆయా కుటుంబసభ్యులు రక్తసంబంధాలనే మరిచిపోతున్నారు. దాడులు చేసుకుంటూ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కన్నతండ్రిని కుమార్తె రోకలి బండతో కొట్టి చంపిన (Daughter kills father) విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist), నవీపేట్ మండలం, ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..

వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవీపేట్ ఎస్‌ఐ వినయ్ గ్రామానికి చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

మరోవైపు హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. డీమార్ట్ వద్ద వ్యక్తి నడిచి వెళుతుండగా అతి వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాచిగూడ సీఐ జోష్న మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

తల్లికి వందనం డబ్బులు పడలేదా..అయితే ఇలా చేయండి

మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు

ఛార్లెట్‌లో ధీమ్‌ తానా పోటీలు విజయవంతం

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 17 , 2025 | 12:04 PM