ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Balaram Nayak: కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చింది.. కాంగ్రెస్ ఎంపీ ఓపెన్‌ ఛాలెంజ్

ABN, Publish Date - Mar 09 , 2025 | 01:06 PM

MP Balaram Nayak: కేంద్ర ప్రభుత్వంపై మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిన్నటి సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

MP Balaram Nayak

హైదరాబాద్: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది జీరో అని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ విమర్శించారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఎంపీ బలరాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు ఫోన్లు చేసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తూతూ మంత్రంగా చెప్పారని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పదే పదే ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ఏ ఏ ప్రాజెక్టులు తెలంగాణకు కావాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగారో ఎంపీ బలరాం నాయక్ వివరించారు.


తెలంగాణ అభివృద్ధి కోసం నిన్నటి సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల నుంచి ఎవరో ఒక్కరూ నిన్న జరిగిన ఎంపీల సమావేశానికి వస్తారని అనుకున్నామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలకు ప్రజల సమస్యలు పట్టవని అన్నారు. కాంగ్రెస్ మీద కుట్రలు చేయడం తప్ప ఆ రెండు పార్టీల నేతలకు వేరే పని లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అయ్యారు.


సీఎం రేవంత్ రెడ్డి మీద బీజేపీ నేతలు నిందలు వేస్తున్నారని ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. ప్రజా భవన్‌లో సమావేశం పెడితే.. అధికారులు కూడా వస్తారని చెప్పారు. ప్రజా భవన్ అందరిదీ ఏ పార్టీ ఎంపీలు అయిన రావచ్చని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడితే కొత్త అప్పులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని ఆగ్రహించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి చర్చిస్తాం.. గతంలో కూడా వెళ్లామని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చింది ఎంత.. తెలంగాణకు ఇచ్చింది ఎంత... బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని ఎంపీ బలరాం నాయక్ సవాల్ విసిరారు. తెలంగాణకు కరెంట్ ఇచ్చే సీలేరు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి కడుతున్న టాక్స్ ఎంత.. కేంద్రం తెలంగాణకు ఇస్తుంది ఎంత అని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 09 , 2025 | 01:16 PM