Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం
ABN, Publish Date - Feb 21 , 2025 | 09:14 PM
Minister Uttam Kumar Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు.
హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SLBC, డిండి, పాలమూరు-రంగారెడ్డికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో ఏటా 100 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయామని తెలిపారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వచ్చే మూడేళ్లలో కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1.81 లక్షల కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కేసీఆర్ అప్పులు తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన నిర్లక్ష్యంతో ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్‌లు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదని అన్నారు. కృష్ణా బేసిన్‌లోని కొన్ని ప్రాజెక్ట్‌లలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా ? అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నీటి తరలింఫుపై నిరసన..
ఏపీ విజ్ఞప్తితో ఇవాళ(శుక్రవారం) జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది. వాయిదా వేయడంతో KRMB చైర్మన్ వద్దకు వెళ్లి తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం నీటి తరలింఫుపై KRMB ఛైర్మన్ వద్ద తెలంగాణ అధికారులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ అభ్యంతరాలు, డిమాండ్లను KRMB చైర్మన్‌కు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా , ఈ ఎన్సీ జనరల్ జి. అనిల్ కుమార్ , నల్గొండ సీఈ అజయ్ కుమార్ నివేదించారు. రానున్న జూలై నెల వరకు సాగు, తాగు నీటి అవసరాల కోసం 116 టీఎంసీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెట్ సమర్పించింది. తక్షణమే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఒక్క చుక్క నీటిని తరలించకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
Read Latest Telangana News and Telugu News
Updated Date - Feb 21 , 2025 | 09:20 PM