ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: సీఎం రేవంత్‌‌రెడ్డి దావోస్‌ పర్యటనపై కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 24 , 2025 | 10:02 PM

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలని చెప్పారు. ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దని తెలిపారు పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Kishan Reddy

హైదరాబాద్: సీఎం రేవంత్‌‌రెడ్డి దావోస్‌ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందంటే విమర్శలు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ వారినే దావోస్‌ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రావాలని చెప్పారు. ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దని తెలిపారు పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.


కర్పూరి ఠాకూర్‌ దేశం కోసమే ఆలోచించారు...

కర్పూరి ఠాకూర్‌ ఎప్పుడూ దేశం కోసమే ఆలోచించారని కిషన్‌రెడ్డి తెలిపారు. హిందీ భాష వ్యాప్తి కోసం కర్పూరి ఠాకూర్‌ కృషి చేశారని కిషన్‌రెడ్డి చెప్పారు. కర్పూరి ఠాకూర్‌ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. కర్పూరి ఠాకూర్‌ బిహార్‌కు రెండుసార్లు సీఎం అయ్యారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


నూతన విద్యావిధానం విద్యార్థులకు ఎంతో మేలు..

అంతకుముందు అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.అనంతరం అంబర్‌పేట గవర్నమెంట్ పోలీస్ బాయిస్ హై స్కూల్ సీపీఎల్‌లో ఫర్నిచర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.


గవర్నమెంట్ స్కూళ్లలో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్ బుక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేసి, శుభ్రత కోసం చర్యలు తీసుకున్నామని అన్నారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో మెరుగైన వసతులు కల్పించేలా విద్యావిధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే నూతన విద్యావిధానాన్ని కొంతమేరకే అమలు చేస్తున్నాయన్నారు. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో విద్యార్థులకు, దేశ భవిష్యత్తుకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ఈ విధానం ప్రాథమిక స్థాయిలోనే ప్రొఫెషనల్ కోర్సులు నేర్పించేందుకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విద్యావిధానం అమలును ప్రారంభించి, విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించడం, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనేకమంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ ఆలోచనల మేరకు, వారి అభిప్రాయాలు తీసుకుని నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని... ఇది దేశభవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.


తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక పాఠశాలల్లో నూతన భవనాలను నిర్మించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అంబర్ పేటలోని తులసీరాంనగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తామన్నారు. అంబర్ పేట ఫ్లైఓవర్‌కు సంబంధించి భూసేకరణను జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేదన్నారు. రోడ్డు విస్తరణ పూర్తిస్థాయిలో జరగలేదని చెప్పారు. భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. కొన్నిచోట్ల అక్రమంగా ప్రార్థనా మందిరాలు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.


ఆ కుటుంబాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శ

కొండ పోచమ్మ చెరువులో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముషీరాబాద్ నియోజకవర్గం బోలకపూర్ డివిజన్, ఇందిరానగర్‌కు చెందిన లోహిత్, బన్సీలాల్ పేట, చాచా నెహ్రూ నగర్‌కు చెందిన కిషన్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం

Dil Raju IT Raids: దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 10:03 PM