ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:21 AM

సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుండి భారత్‌కు తిరిగి వస్తున్నారు. పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ఇప్పటికే ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Retd IPS Prabhakar Rao

హైదరాబాద్, జూన్ 01: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చినట్లు సమాచారం. వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు ప్రభాకర్ రావు బయలుదేరినట్లు తెలుస్తోంది.


సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుండి భారత్‌కు తిరిగి వస్తున్నారు. పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ఇప్పటికే ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకుంటున్న విషయం విదితమే. మరోవైపు ఈ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడు కావడంతో.. అతడిని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందం భావిస్తుంది. ఆ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్) విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు గుర్తించింది. ఇక ఈ కేసుతో ప్రమేయమున్న వారిందరిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టారు.

అందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావును సెట్ అధికారులు గుర్తించారు. అతడిని స్వదేశానికీ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అంతేకాదు.. ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఆయన కోరారు.


దీంతో ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బీవీ నాగరత్నమ్మ, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలు విచారించారు. విచారణకు వచ్చే వరకు ప్రభాకర్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయనకు పాస్ పోర్ట్ అందచేయాలంది. ఈ పాస్ పోర్టు అందిన మూడు రోజుల లోపు భారత్‌కు తిరిగి వచ్చి.. దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. ఈ విచారణకు సహకరించాలని పిటిషనర్ ప్రభాకర్ రావుకు సూచించింది. దీంతో ప్రభాకర్ రావు స్వదేశానికి బయలు దేరుతున్నారు. జూన్ 5వ తేదీన ఆయన ఈ కేసు విచారణకు హాజరవుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

ఇంత త్వరగా పాకిస్థాన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నట్లు..

For Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 09:52 AM