ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడొద్దు.. సీఎం ఆదేశం

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:18 PM

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు.

Jubilee Hills By Election

హైదరాబాద్, జూన్ 24: గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో (PAC Meeting) పలు కీలకమైన అంశాలపై చర్చించారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై (Jubilee Hills By Election) ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఉప ఎన్నికలో గెలవాల్సిందే అని ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందరినీ సమన్వయం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Minister Ponnam Prabhakar) బాధ్యతలు అప్పజెప్పారు. ఇక.. అభ్యర్థి ఎంపికకు సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. తామే అభ్యర్థులమంటూ కొంతమంది తేల్చిచెబుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు.

ఏ ఎన్నిక జరిగినా ఒకే ప్రక్రియ ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అదే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఇక.. పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హాట్ హాట్ చర్చ జరిగింది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు రావడంతో పని భారం పెరుగుతోందని వారు చెప్పుకొచ్చారు.

గొర్రెలతో నిరసనపై సీఎం సీరియస్

మరోవైపు నిన్న గాంధీ భవన్‌లో గొర్రెలతో నిరసన చేయడంపై సీఎం చాలా సీరియస్ అయ్యారు. గాంధీ భవన్‌లో ఇలాంటివి ఎంటర్ టైన్ చేయొద్దని ఆదేశించారు. నిరసనకు ఓ పరిమితి ఉంటుందన్నారు. కాంగ్రెస్ అందరి అభిప్రాయం తీసుకుంటుందని.. అందరినీ గౌరవిస్తుందన్నారు. ఇది పార్టీ ఆఫీసా ఇంకా ఏమైనానా అని గాంధీభవన్ ఆఫీస్ బేరర్స్‌ను ప్రశ్నించారు. ఇష్టా రీతిలో నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారు అని సీఎం ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు.

ఇంచార్జ్ మంత్రులపై అసంతృప్తి

అలాగే ఇంచార్జ్ మంత్రుల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే భాధ్యత ఇంచార్జ్ మంత్రులకు అప్పగించినా చేయడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం గెలిచేలా ఇంచార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రుల దగ్గర ఫండ్స్ పెట్టామని, వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదని పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

రాజకీయాలకతీతంగా బోనాలు చేసుకుందాం.. పొన్నం పిలుపు

హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:13 PM