Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..
ABN, Publish Date - Jul 19 , 2025 | 04:38 PM
భాగ్య నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట, సరూర్‌నగర్, సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
హైదరాబాద్: భాగ్య నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ లో మరోసారి కుండపోతగా వర్షం పడుతోంది. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బోయినపల్లి, ఆల్వాల్, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్, మలక్‌పేట్, చార్మినార్, ముషీరాబాద్, అబిడ్స్, కోటి, హిమాయత్ నగర్, కాచిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, బంజారాహిల్స్, ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కొత్తపేట, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట, సరూర్‌నగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్‌పేట్, ఈసీఐఎల్, కప్రా, నేరేడ్‌మెట్, విద్యానగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
GHMC అలర్ట్..
తీవ్ర వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రెండు గంటల్లో నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని GHMC పేర్కొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాకూడదని.. ముఖ్యంగా వరదనీటితో నిండిన ప్రాంతాల్లో తిరగకూడదని హెచ్చరించింది. వర్షాల కారణంగా ఏమైన సమస్యలు తలెత్తితే వెంటనే 040-29555500, 9000113667 టోల్ ఫ్రీ నెంబర్లు కాల్ చేయాలని సూచించింది.
మరో 5 రోజులపాటు..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అందులో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, ములుగు, భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు నాలుగు రోజులు ఎల్లో అలర్ట్, మూడో రోజున ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News
Updated Date - Jul 19 , 2025 | 06:07 PM