ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Muralidhar Rao: రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ అరెస్ట్

ABN, Publish Date - Jul 15 , 2025 | 09:27 PM

తెలంగాణ నీటి పారుదల శాఖలో పని చేసి రిటైర్ అయిన ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన్ని అధికారులు అరెస్ట్ చేశారు.

Retd ENC Muralidhar

హైదరాబాద్, జులై 15: అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ రావును ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది కోట్ల రూపాయిలు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, విలువైన వస్తువులు మురళీధర్ రావు పేరిట ఉన్నట్లు గుర్తించారు. కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్‌ గూడ, బేగంపేట, కోకాపేట్‌లలో ఆయనకు పలు ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కరీంనగర్, హైదరాబాద్‌ నగరాల్లో కమర్షియల్ బిల్డింగులు.. అదే విధంగా కోడాడలో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2 కిలో వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో మరో అపార్ట్‌మెంట్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో కనుగోన్నారు.

వీటితోపాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో నాలుగు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6,500 చదరపు గజాల భూమి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అదే విధంగా మూడు కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సైతం ఈ సోదాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ అధికారిక హోదాను దుర్వినియోగం చేయడం ద్వారా మురళీధర్ సంపాదించిన ఆస్తులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలు పూర్తయిన అనంతరం రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

 రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 15 , 2025 | 10:08 PM