Share News

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:35 PM

వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 13 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి
Road Accidents

జమ్మూ కశ్మీర్/నైనిటాల్, జులై 15: వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్ జిల్లా మువనీ పట్టణంలోని సుని బ్రిడ్జ్ సమీపంలోని వాహనం భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.అలాగే జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలో 22 మంది టెంపో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ రెండు ఘటనలపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అందులోభాగంగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక ఆ యా ప్రమాద ఘటనల్లో మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

road-accident-01.jpg


పరిమితికి మించి ప్రయాణికుల కారణంతో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దోడా జిల్లా అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.


అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ సైతం ఈ ప్రమాదంపై స్పందించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

భూమిని చేరిన శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ రియాక్షన్

ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 08:44 PM