Share News

Shubhanshu Shukla Returns: శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:24 PM

కాలిఫోర్నియాలోని శాండియాగో సముద్ర తీరంలో యాక్సియం 4 మిషన్ మంగవారం మధ్యాహ్నం సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శుభాంశు శుక్లాతోపాటు ఆయన బృందాన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Shubhanshu Shukla Returns: శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
Shubhanshu Shukla

వాషింగ్టన్, జులై 15: అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం నుంచి కాలిఫోర్నియాలో శాండియాగో సముద్ర తీరంలో యాక్సియం 4 మిషన్ సురక్షితంగా దిగింది. ఈ యాత్రను పూర్తి చేసుకుని భూమిపైకి చేరిన శుభాంశు శుక్లాతోపాటు అతడి బృందాన్ని నాసా అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వీరి రక్తపోటు, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయిలను వైద్యులు తనిఖీ చేస్తారు. వారి నుంచి క్యాప్సూల్ తీస్తారు. అనంతరం వారిని రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) ఇస్తారు. ఎందుకంటే.. శరీరంలో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండేందుకు ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్లు కలిగిన నీటిని వీరికి అందిస్తారు.

అంతరిక్షానికి దిగిన వెంటనే శుభాంశు శుక్లా బృందాన్ని నేరుగా నాసాకు చెందిన జాన్సన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకు వెళ్తారు. 1 నుంచి 2 గంటల తర్వాత.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం సూప్ లేదా జ్యూస్ అది కాకుంటే.. ద్రవ ఆహారం వారికి అందజేయనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత.. వ్యోమగాముల కడుపులో జీర్ణ క్రియ నెమ్మదిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి తేలికపాటి ద్రవాలు అందజేస్తారు.


ఇక 6 నుంచి 12 గంటలలోపు.. వీరు ఆరోగ్యంగా ఉంటే తేలికపాటి స్నాక్స్ లేదా ఆహారం అందజేస్తారు. అయితే కొన్ని సార్లు తమకు ఇష్టమైన ఆహారాన్ని వ్యోమగాములు అడుగుతుంటారు. వీరు అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. దాంతో అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి భూమి మీద సహాజ గురుత్వాకర్షణ శక్తికి చాలా తేడా ఉంటుంది. దీంతో వీరి ఆరోగ్యం భూమి మీదకు వచ్చిన వెంటనే సర్దుబాటు కాదు. ఈ దశలో వ్యోమగాముల శరీరాలు అనేక మార్పులకు లోనవుతాయి. అంటే.. ఎముక సాంద్రతతోపాటు కండరాల బలాన్ని తాత్కాలికంగా కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. అది అవయవ పని తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక నాసా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతరిక్షయానం ప్రారంభంలో.. ముఖంలో వాపు, కాళ్లలో రక్తం పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. వీరు భూమికి తిరిగి వచ్చిన తర్వాత సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీంతో వీరిని వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.

ఇవి కూడా చదవండి..

అర్ధరాత్రి రోడ్డుపై యువతీయువకుల హల్‌చల్..

కడపలో దారుణం..

For More International News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:24 PM