Share News

PM Modi: భూమికి చేరిన శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ రియాక్షన్

ABN , Publish Date - Jul 15 , 2025 | 07:51 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న భారత వ్యోమగామిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కోట్లాది మందికి ఆయన ప్రేరణ అన్నారు. గగన్‌యాన్‌కు ఇది

PM Modi: భూమికి చేరిన శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ రియాక్షన్
PM Narendra Modi

న్యూఢిల్లీ, జులై 15: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి శుక్లా అని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మందికి ఆయన అంకితభావం, ధైర్యం, స్ఫూర్తి ప్రేరణ అందిస్తుందన్నారు. గగన్‌యాన్‌కు ఈ యాత్ర మరో మైలురాయి అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ స్పందించారు.

గత నెల జూన్ 25వ తేదీన ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్‌, స్లావోస్జ్‌ యుజాన్‌స్కీ విష్నేవ్‌స్కీ,టైబోర్‌ కపుతో కలిసి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనమయ్యరు. అమెరికాలోని ఫ్లోరిడాలో నాసా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.


ఇక గతంలో శుభాంశు శుక్లా చేయవలసిన ఈ అంతరిక్ష యాత్ర పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చివరకు జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 12. 01 గంటలకు యాక్సియం 4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లింది. దాదాపు 18 రోజుల అనంతరం కాలిఫోర్నియాలో శాన్‌డియాగో తీరంలో డ్రాగన్ అంతరిక్ష నౌక గ్రేస్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా దిగింది.

ఇవి కూడా చదవండి..

ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 08:38 PM