ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Congress BRS clash: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఎందుకంటే

ABN, Publish Date - Jul 15 , 2025 | 04:23 PM

Congress BRS clash: గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్‌‌పై కాంగ్రెస్‌ నేతలు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే రామును ఆస్పత్రికి తరలించారు. విప్ బీర్ల ఐలయ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు పట్టించుకోని పరిస్థితి.

Congress BRS clash

హైదరాబాద్, జులై 15: మల్కాజ్‌గిరి ఆషాఢ మాస బోనాల చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్వాల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (Congress, BRS) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అల్వాల్‌లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ నేతలు కూర్చోవడంతో గొడవ మొదలైంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్టేజ్‌పై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయకుండా మాజీ కార్పొరేటర్లకు ఏ విధంగా స్థానం ఇస్తారంటూ కాంగ్రెస్ నేతలు, అధికారులను మర్రి రాజశేఖర్ రెడ్డి నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.

గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్‌‌పై కాంగ్రెస్‌ నేతలు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే రామును ఆస్పత్రికి తరలించారు. విప్ బీర్ల ఐలయ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు పట్టించుకోని పరిస్థితి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఇటీవల సికింద్రాబాద్‌లో కూడా ఆషాఢ మాస బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

చందు నాయక్‌పై కాల్పుల ఘటన.. పోలీసులు చెప్పిన విషయాలు ఇవే

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 04:25 PM