CPI Leader Gun Attack: చందు నాయక్‌పై కాల్పుల ఘటన.. పోలీసులు చెప్పిన విషయాలు ఇవే
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:13 PM
CPI Leader Gun Attack: సీపీఐ నేత చందు నాయక్ హత్య కేసుపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ మాట్లాడారు. చందు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు.
హైదరాబాద్, జులై 15: దిల్‌సుఖ్‌నగర్‌లో సీపీఐ నేత చందు నాయక్‌పై (CPI Leader Chandu Naik) కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. వాకింగ్ చేస్తున్న సీపీఐ నేతపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో చందు నాయక్ ఘటనా స్థలిలోనే మరణించాడు. విషయం తెలిసిన వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 7:30 సమయంలో శాలివాహన నగర్‌లో ఫైరింగ్ జరిగిందని.. చందు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు.
ఘటనా స్థలంలో 7 బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో మూడు బుల్లెట్లు సీపీఐ నేత బాడీలోకి చొచ్చుకుని పోయాయని వెల్లడించారు. మరో రెండు బుల్లెట్లు మిస్ ఫైర్ అవగా.. మరో రెండు బుల్లెట్లు గన్‌లో లోడ్ చేస్తుండగా కిందపడినట్లు తెలిపారు. ఏ టైప్ గన్ వాడారు అనేది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. నలుగురు వ్యక్తులు ఈ కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. నిందితుల కోసం పది బృందాలు గాలిస్తున్నాయన్నారు. చందు నాయక్ ఎల్బీనగర్‌లో ఓ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నారని తెలిపారు. చందు నాయక్‌పై ఉన్న కేసులను ఆరా తీస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
Read latest Telangana News And Telugu News