CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
ABN, Publish Date - Mar 17 , 2025 | 06:24 PM
CM Revanth Reddy: రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తనకు పాలనపై పట్టు రాలేదంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన కాస్తా ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్, మార్చి 17: తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారని.. కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనే పట్టు ఉన్నట్లా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులను తొలగించి.. బదిలీలు చేస్తేనే.. పరిపాలనపై పట్టు సాధించినట్లా అని ప్రతిపక్షాలను ఆయన నిలదీశారు. అన్నింటిని సరిదిద్దుకుంటూ వెళ్లడమే తన విధానమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని ఆయన కుండ బద్దలు కొట్టారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.6 వేల కోట్లతో ఈ పథకం చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు సాయంగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 10 నెలల్లోనే 57,924 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వివరించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఇన్నీ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం దేశంలోనే లేదని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు త్వరలోనే 1.20 కోట్ల చీరలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకే.. పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 29,550 పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం.. ఆర్టీసీకి రూ.5,500 కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదే విధంగా రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశామని.. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు సైతం పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపైనా అసెంబ్లీలో బిల్లు పెట్టామన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారా చేసిందన్నారు.
కానీ తాము దుబారా ఖర్చులు తగ్గిస్తూ.. అప్పులు చెల్లిస్తున్నామని చెప్పారు. నిత్యవసర ధరల నియంత్రణలో దేశంలోనే ముందున్నామని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ ముందుందని గుర్తు చేశారు. ఇక ఇసుక విక్రయంలోనే రోజు వారీ ఆదాయం రూ. 3 కోట్లు పెరిగిందన్నారు. అబద్దాల పునాదులపై తాము ప్రభుత్వాన్ని నడపట్లేదన్నారు. దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కులగణన జరగలేదని గుర్తు చేశారు. దేశమంతా కుల గణన జరగాల్సిన అవసరం ఉందని.. దాని ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక్కప్పుడు నోటిఫికేషన్ల కోసం రాష్ట్రంలో ధర్నాలు జరిగేవన్నారు. గత పదేళ్లలో ఒక్క గ్రూప్-1 పరీక్ష సైతం నిర్వహించలేదని గుర్తు చేశారు. ఇక రూ.6 వేల కోట్లతో ఇలాంటి పథకాన్ని ఎవరూ ప్రారంభించలేదన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 5 వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో ఫలితాలు పారదర్శకంగా ఉన్నాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తెర మీదకు తీసుకు వచ్చింది. దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల వరకు రాయితీతో రుణాలు అందిస్తుంది. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు మంజూరు చేస్తారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో రుణాలు అందజేయనుంది. ఈ పథకంలో దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ 5వ తేదీ. ఏప్రిల్ 6 నుంచి మే 31 వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జూన్ 2 వ తేదీన రాయితీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
ఇవి కూడా చదవండి...
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
For Telangana News And Telugu News
Updated Date - Mar 17 , 2025 | 06:27 PM