Share News

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:31 PM

Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను నిలువునా దోచుకునేందుకు ముసుగు దొంగలు అధికమయ్యారు. వివిధ మార్గాల్లో భక్తులను తమ మాటలతో బురిడి కొట్టించి.. భక్తుల జేబులకు చిల్లులు పెడుతూంటారు. అలాంటి వేళ తిరుమలలో భక్తులు అప్రమత్తంగా ఉండాలంటే..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

తిరుమలలో కొలువు తీరిన ఆ దేవదేవుడు శ్రీనివాసుడిని దర్శించుకొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అలా వచ్చే భక్తులను పలువురు కేటుగాళ్లు.. తమ మాయమాటలతో బురుడి కొట్టిస్తారు. దీంతో తాము మోసపోయామని భావించిన వారు.. పోలీసులను ఆశ్రయిస్తారు. దాంతో జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమలలో శ్రీవారి దర్శించుకునేందుకు వెళ్లే వారు.. ఈ సమాచారాన్ని తమ వద్ద పెట్టుకొంటే.. ఎప్పుడో అప్పుడు ఉపయోగ పడే అవకాశముంది. అందుకోసం తిరుమల పోలీసులు ఏం చెబుతున్నారంటే..


శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల కోసం ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in లోనే నమోదు చేసుకోవాలి. టీటీ దేవస్థానమ్స్ యాప్ ద్వారా సైతం ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు.

టీటీడీ అధికారుల అధికారిక ఈ మెయిల్‌ ఐడీలు.. టీటీడీ ఈవో: eottd@tirumala.org, eottdtpt@gmail.com

టీటీడీ అదనపు ఈవో: jeotml@tirumala.org

తిరుపతి జేఈవో: jeotpt@tirumala.org లను సంప్రదించవచ్చు

వీఐపీ బ్రేక్‌ దర్శనం, సిఫార్సు లేఖలను తితిదే ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తితిదే ఉద్యోగుల వద్ద నేరుగా తీసుకోవడం ద్వారా దళారుల బారిన పడకుండా ఉండొచ్చు.

శ్రీవారి దర్శనం, వసతితోపాటు మరే ఇతర సందేహాలు అయినా నివృత్తి చేసుకునేందుకు టీటీడీ టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 1800-4254141 లేదా 155257కు ఫోన్‌ చేయవచ్చు.

అలాగే తిరుమల వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌- 94407 96769

తిరుమల టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌- 94407 96772


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 05:31 PM