ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నాబార్డ్ చైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. అసలు కారణమిదే

ABN, Publish Date - Mar 21 , 2025 | 05:12 PM

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అభివద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం రేవంత్ కోరారు.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ(శుక్రవారం) నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ అయ్యారు. ఆర్‌ఐడీఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వయంసహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం కోరారు.


ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి అడిగారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులు మార్చ్ 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు చైర్మన్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Betting App: ఆ హీరోల వల్లే 80 లక్షలు పోగొట్టుకున్నా.. వారిని శిక్షించాల్సిందే..

Good News: రేషన్ కార్డు దారులకు శుభవార్త..

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 05:16 PM